కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సీన్ సినిమా దుబాయ్ లో ప్రమోషన్

రిపోర్టర్: హరి స్థలం: Dubai

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తోన్న తాజా ప్రాజెక్ట్ సీన్ సినిమా ప్రమోషన్ ఈవెంట్ను దుబాయ్లో నిర్వహించనున్నట్లు చిత్రయూనిట్ వెల్లడించింది. జీతూ మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ నవంబర్ ఆరున ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ ఇరవై ఐదున సిలికాన్ సెంట్రల్ మాల్లో భారీ పబ్లిక్ ఈవెంట్ జరగనుందని, ఇందులో హీరో సూర్యతో పాటు చిత్ర బృందం పాల్గొని సందడి చేయనుందని చిత్ర వర్గాలు స్పష్టం చేశాయి.