'భూదోపిడీ ఆలోచనల నుంచే ధరణి పుట్టుకొచ్చింది': సీఎం రేవంత్ రెడ్డి ఫైర్
రిపోర్టర్: గోపి
స్థలం: హైదరాబాద్
తెలంగాణలో నిషేధిత జాబితా (22ఏ) భూముల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోందని శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్, అప్పటి సీఎస్ సోమేశ్ కుమార్ కలిసి భూదోపిడీ ఆలోచనలతోనే ‘ధరణి’ వ్యవస్థను రూపొందించారని సీఎం తీవ్రస్థాయిలో విమర్శించారు. కోటి ఎకరాలు నిషేధించారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన ఆయన, అసలు వివాదం కేవలం 3.73 లక్షల ఎకరాల ప్రైవేట్ పట్టా భూములకు మాత్రమే సంబంధించిందని స్పష్టం చేస్తూ త్వరలోనే యూఎల్సీ భూములపై నూతన విధానం తెస్తామని హామీనిచ్చారు.