న్యూయార్క్ మారథాన్ లో వాలంటీర్ గా మారిన మేయర్ జోహ్రాన్ మమ్దాని
రిపోర్టర్: వెంకట్
స్థలం: New York
న్యూయార్క్ మారథాన్ లో మేయర్ జోహ్రాన్ మమ్దాని వాలంటీర్ గా సేవలందించారని నిర్వాహకులు తెలిపారు. క్వీన్స్ లోని లాంగ్ ఐలాండ్ సిటీలో జరిగిన మారథాన్ లో ఆయన స్వయంగా పాల్గొని పరుగు పందెంలో పాల్గొన్న అథ్లెట్లకు తాగునీరు అందించారు. సాధారణ రాజకీయ నాయకుడిలా కాకుండా ప్రజల మధ్యలో నిలబడి ఆయన చేసిన ఈ మంచి పనికి సోషల్ మీడియాలో ప్రశంసలు వస్తున్నాయని, సామాన్యులు మేయర్ పై తమ ప్రేమను వ్యక్తం చేస్తున్నారని స్థానికులు పేర్కొన్నారు.