జేఈఈ లేకుండా ఐఐటీ మద్రాస్ లో డిగ్రీ పొందే అవకాశం
రిపోర్టర్: సునీల్
స్థలం: తమిళనాడు
జేఈఈ పరీక్ష రాయకుండానే ఐఐటీ మద్రాస్‌లో బీఎస్ డిగ్రీ కోర్సులు అభ్యసించే సువర్ణావకాశాన్ని కల్పిస్తున్నారు. డేటా సైన్స్, ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ వంటి కోర్సుల్లో ప్రవేశం పొందవచ్చు. జేఈఈ స్కోర్ లేని విద్యార్థులు నాలుగు వారాల క్వాలిఫైయర్ ప్రాసెస్ ద్వారా ప్రవేశం పొందవచ్చని సంస్థ స్పష్టం చేసింది. ఏడాదిలో మూడుసార్లు దెశవ్యాప్తంగా ప్రవేశాలు కల్పిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.