కృష్ణనామ స్మరణతో మార్మోగిన నెల్లూరు ఇస్కాన్ మందిరం

రిపోర్టర్: praveen kumar స్థలం: నెల్లూరు రూరల్

శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని నెల్లూరు ఇస్కాన్ సిటీ సెంటర్లోని శ్రీకృష్ణ మందిరం భక్తి శ్రద్ధలతో కళకళలాడింది. జగన్నాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులు భక్తి పరవశంతో స్వామివారిని దర్శించుకున్నారు.

బాలకృష్ణుడిని ఉయ్యాలలో ప్రతిష్ఠించగా భక్తులు భక్తిశ్రద్ధలతో ఉయ్యాల ఊపుతూ దర్శించుకున్నారు. హరే కృష్ణ మహామంత్ర నామస్మరణతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.