అరుదైన ప్రతిభ: ఒంటారియో లెజిస్లేటివ్ అసెంబ్లీలో చిన్నారి అర్జున్ విశాల్ ఘన సత్కారం
రిపోర్టర్: సురేష్
స్థలం: Vadodara
అసాధారణ మేధస్సుతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఐదేళ్ల ప్రజ్ఞాశాలి అర్జున్ విశాల్ ప్రజాపతిని ఒంటారియో లెజిస్లేటివ్ అసెంబ్లీ ఘనంగా సత్కరించింది. గుజరాత్ మూలాలున్న ఈ బాలుడు నాలుగేళ్ల ప్రాయంలోనే మెన్సా, ఇంటర్టెల్ సంస్థల్లో సభ్యత్వం పొంది అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ నేపథ్యంలో అక్టోబర్ ఇరవై తొమ్మిదో తేదీన కెనడాలోని ఒంటారియో శాసనసభలో అతనికి ఘన స్వాగతం లభించిందని, ఎంపీపీ మేరీ మార్గరెట్ మెక్‌మహన్ సర్టిఫికెట్ అందజేశారని బాలుడి తండ్రి విశాల్ ప్రసాద్ తెలిపారు.