అధికారుల నిర్లక్ష్యపు సుడిగుండంలో చిక్కుకున్న పల్లె రహదారి
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: సఖినేటిపల్లి
సఖినేటిపల్లి మండలం అంతర్వేదిపాలెం గ్రామంలోని సచివాలయం రెండుకు వెళ్లే ప్రధాన రహదారి నీటమునగడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సచివాలయంతో పాటు అక్కడే ఉన్న హోమియో ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చే రోగులు, పింఛన్ల కోసం వచ్చే వృద్ధులు, మహిళలు ఆ నీటిలోనే నడుస్తూ తీవ్ర నరకయాతన పడుతున్నారు. సుమారు మూడు లక్షల రూపాయలతో రోడ్డు నిర్మాణం చేపట్టాల్సి ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాపోతున్నారు. పాలకులు ఇప్పటికైనా స్పందించి రహదారిని పునరుద్ధరించి శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తున్నారు.