ఉగ్రవాది హఫీజ్ సయీద్‌పై మరోసారి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ
రిపోర్టర్: సురేష్
స్థలం: జమ్మూ కశ్మీర్
ముంబయి ఉగ్రదాడుల సూత్రధారి, లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్‌పై జమ్మూలోని ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. కశ్మీర్ లోయలో ఉగ్రవాదులకు ఆయుధాలు, నిధులు సమకూరుస్తున్నట్లు ఆరోపణలు రావడంతో రెండు నెలల వ్యవధిలోనే అతడిపై రెండోసారి వారెంట్ జారీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం అతడు పాకిస్థాన్‌లో ఉన్నట్లు దర్యాప్తు సంస్థ తెలిపింది.