శ్రీశైల భక్తులకు అలర్ట్: నవంబరు నెల ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు విడుదల
రిపోర్టర్: రమేష్
స్థలం: శ్రీశైలం
శ్రీశైల దేవస్థానానికి సంబంధించిన నవంబరు నెల ఆర్జిత సేవలు, స్పర్శ దర్శనం టికెట్లను ఆన్లైన్లో విడుదల చేసినట్లు దేవస్థానం ధర్మకర్తలమండలి అధ్యక్షుడు పోతుగుంట రమేష్‌నాయుడు మరియు ఈవో ఎం.శ్రీనివాసరావు తెలిపారు. 80 శాతం టికెట్లను వాట్సప్ ద్వారా, మిగిలిన 20 శాతం టికెట్లను అధికారిక వెబ్సైట్ ద్వారా పొందొచ్చని వారు పేర్కొన్నారు. కార్తిక మాసోత్సవాల నేపథ్యంలో కొన్ని సేవలను రద్దు చేసినట్లు, మరికొన్నింటికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కల్పించినట్లు అధికారులు స్పష్టం చేశారు.