రూపాయి నోట్లతో అమ్మవారి అలంకరణ: అమలాపురంలో ఘనంగా దసరా ఉత్సవాలు

రిపోర్టర్: కిరణ్ స్థలం: అమలాపురం

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని ప్రసిద్ధ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు. శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా అమ్మవారిని రూ.4.50 కోట్ల విలువైన నూతన కరెన్సీ నోట్లతో అద్భుతంగా అలంకరించారు. మహాలక్ష్మి దేవిగా దర్శనమిచ్చిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.