రీల్స్ కోసం డ్యామ్‌పై నుంచి దూకి వ్యక్తి కాళ్లు విరిగాయి

రిపోర్టర్: అశోక్ స్థలం: ఉత్తరప్రదేశ్

ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో సోషల్ మీడియా రీల్స్ కోసం పహుజ్ డ్యామ్ పై నుంచి 30 అడుగుల ఎత్తులో దూకిన వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. నీటి లోతును అంచనా వేయలేకపోవడంతో కింద ఉన్న రాళ్లపై పడి రెండు కాళ్ల ఎముకలు విరిగడ్డాయి. స్నేహితులు ఈ ప్రమాదకర విన్యాసాన్ని కెమెరాలో బంధించారు. స్థానికులు అతన్ని రక్షించి ఆసుపత్రికి తరలించగా వైద్యులు శస్త్రచికిత్స చేశారు.