ఆసియా క్రీడల భారత రగ్బీ జట్టులో ఒడిశా వనితలు

రిపోర్టర్: కిరణ్ స్థలం: ఒడిశా

జపాన్‌లోని ఐచి-నగోయా వేదికగా జరిగే ఆసియా క్రీడల కోసం ప్రకటించిన భారత మహిళల రగ్బీ సెవెన్స్ జట్టులో ఒడిశాకు చెందిన నలుగురు క్రీడాకారిణులు చోటు దక్కించుకున్నారు. మయూర్‌భంజ్‌కు చెందిన సీనియర్ ఆటగారాలు దుముని మార్ండి, మమా నాయక్, నిర్మల్య రౌత్, సంధ్యారాణి తుడు ఈ జట్టులో స్థానం సంపాదించి రాష్ట్రం తరఫున సత్తా చాటారు.