ప్రధాని మోదీ సేవా ఏడాదులపై జీకేవీధిలో సేవ సంకల్ప అభియాన్

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: జి.కె.వీధి

అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలంలో ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజా సేవను పురస్కరించుకుని బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో సేవ సంకల్ప అభియాన్ నిర్వహించారు. ఇందులో భాగంగా లక్కవరం పాఠశాలలో మెడికల్ క్యాంప్ నిర్వహించడంతో పాటు విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.