వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ కొత్త సినిమా

రిపోర్టర్: సునీల్ స్థలం: Hyderabad

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రానికి దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. ఈ చిత్రంలో సల్మాన్ సరసన నయనతార నటిస్తుండగా, అరవింద్ స్వామి, జాకీ ష్రాఫ్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ సగం పూర్తయిందని, ఇందులో సల్మాన్ ఒక విభిన్నమైన పోలీస్ పాత్రలో అలరించనున్నారని సమాచారం.