కర్మ పూజ సందర్భంగా ఆ రాష్ట్రాల్లో పాఠశాలలకు సెలవు
రిపోర్టర్: రమేష్
స్థలం: West Bengal
కర్మ పూజ పండుగ సందర్భంగా పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లోని పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెప్టెంబర్ 22న అధికారిక సెలవుదినంగా ప్రకటించారు. ఈ మేరకు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీ చేశాయి. బంకురా, పురులియా, జార్గ్రామ్, పశ్చిమ మేదినీపూర్ జిల్లాల్లో ఈ వేడుకను ఘనంగా నిర్వహిస్తారు. అయితే ఇతర ప్రాంతాల విద్యార్థులు తమ పాఠశాలల నుంచి వచ్చే నోటిఫికేషన్లను గమనించాలని సూచించారు.