మంగళగిరిలో వీఆర్‌ఏల ఆందోళన తీవ్ర ఉద్రిక్తత

రిపోర్టర్: భాస్కర్ స్థలం: మంగళగిరి

తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళగిరిలో ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. సీసీఎల్‌ఏ కార్యాలయానికి వెళ్తున్న వీఆర్‌ఏలను పోలీసులు అడ్డుకోవడంతో వారు రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. సంఘం నేతలు కె.ఉమామహేశ్వరరావు, బందగీ సాహెబ్ మాట్లాడుతూ పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి అనగాని సత్యప్రసాద్‌ను కలిసి ఉద్యోగ సంఘాల నేతలు వినతిపత్రం అందజేశారు.