దసరా సెలవుల్లో ఊరెళ్తున్నారా: తాళం వేసిన ఇళ్లపై ఏపీ పోలీసుల కీలక హెచ్చరిక
రిపోర్టర్: విజయ్
స్థలం: అమరావతి
దసరా సెలవుల్లో సొంతూళ్లకు వెళ్లేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, లేదంటే ఇల్లు గుల్లయ్యే ప్రమాదం ఉందని ఏపీ పోలీసులు హెచ్చరించారు. తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా దొంగలు మాటు వేసి ఉంటారని, లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. విలువైన వస్తువులను బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్ వందకు సమాచారం అందించాలని అధికారులు తెలిపారు.