వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి వద్ద మాజీ ఎమ్మెల్యేపై పోలీసుల దాడి

రిపోర్టర్: హరి స్థలం: Warangal

వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి దుస్థితిని ప్రశ్నించేందుకు వెళ్లిన మాజీ చీఫ్ విప్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ పై పోలీసులు పాశవికంగా దాడి చేశారని బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆసుపత్రిలో సరిపడా బెడ్లు లేకపోవడం, పెచ్చులూడుతున్న పైకప్పులు, ఆంబులెన్స్ ల కొరతపై నిలదీయడానికి వెళ్లిన నేతలను అడ్డుకోవడంపై మండిపడింది.