గణేష్ నిమజ్జనంపై సీసీ కెమెరాల నిఘా ఉందన్న ఎస్పీ వినీత్
రిపోర్టర్: వెంకట్
స్థలం: నారాయణపేట
నారాయణపేట, మక్తల్ పట్టణాల్లో వినాయక నిమజ్జనోత్సవాలను పురస్కరించుకుని పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ డాక్టర్ వినీత్ తెలిపారు. నిఘాలో భాగంగా 24 గంటలూ సీసీ కెమెరాలు, వీడియోగ్రఫీతో పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలందరూ పోలీసుల సూచనలు తూచా తప్పకుండా పాటిస్తూ, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా శాంతియుత వాతావరణంలో నిమజ్జనం విజయవంతం చేయాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. అత్యవసర సహాయం కోసం డయల్ 112ను లేదా కంట్రోల్ రూమ్‌ను సంప్రదించాలని కోరారు.