అంతర్జాతీయ సంచలనం: మాల్దీవుల మాజీ విదేశాంగ మంత్రి అబ్దుల్లా షాహిద్ అరెస్ట్
రిపోర్టర్: హరి
స్థలం: Malé
మాల్దీవుల మాజీ విదేశాంగ మంత్రి అబ్దుల్లా షాహిద్ ను మైనర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలతో పోలీసులు అరెస్టు చేసినట్లు మాల్దీవులు పోలీసులు సోమవారం తెలిపారు. మాలెలో కోర్టు వారెంట్ ద్వారా ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలను అబ్దుల్లా షాహిద్ పూర్తిగా ఖండించారు. ఇవి పూర్తిగా రాజకీయ ప్రేరేపిత నిరాధార ఆరోపణలని ఆయన స్పష్టం చేశారు. ఈ పరిణామం ఆ దేశ రాజకీయాల్ లో తీవ్ర కలకలం రేపింది.