అత్యాచార బాధితురాలపై బలవంతంగా మాతృత్వం మోపడం హక్కుల భంగమే: దిల్లీ హైకోర్టు
రిపోర్టర్: కృష్ణ
స్థలం: India
అత్యాచార బాధితురాలిని గర్భాన్ని కొనసాగించమని బలవంతం చేయడం ఆమె గౌరవంగా జీవించే హక్కును దెబ్బతీయడమే అని దిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. 30 వారాలు దాటిన గర్భాన్ని తొలగించుకునేందుకు 15 ఏళ్ల మైనర్ బాధితురాలికి న్యాయస్థానం అనుమతినిచ్చింది. మహిళకు తన శరీరంపై పూర్తి హక్కు ఉంటుందని, ఇష్టానికి వ్యతిరేకంగా మాతృత్వం మోపడం దీర్ఘకాలిక క్షోభకు గురిచేస్తుందని కోర్టు వ్యాఖ్యానించింది.