పాడి పరిశ్రమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే స్పష్టీకరణ

రిపోర్టర్: కృష్ణ స్థలం: తూర్పు గోదావరి

రాజమహేంద్రవరం రూరల్ పరిధిలోని దుళ్ల గ్రామంలో నిర్వహించిన పశువుల వైద్య శిబిరం కార్యక్రమంలో పాల్గొన్నట్లు రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. ఈ సందర్భంగా పాడి పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం పూర్తిస్థాయిలో కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని పాడి రైతులు ఈ సంచార వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.