గోస్తనీ నదిలో ఇసుక తవ్వకాలు ఆపాలని డిప్యూటీ సీఎంకు లేఖ
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: విజయనగరం
శృంగవరపుకోట మండలం మామిడిపల్లి సమీపంలోని గోస్తనీ నదిలో జరుగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలను అడ్డుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు బాధితుడు లేఖ రాశారు. బ్రిడ్జి, ఊటబావులకు ముప్పు వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కోర్టు ఆదేశాలు ఉన్నా అధికారులు స్పందించలేదని, స్థానిక నాయకుల అండతోనే ఇసుక దందా సాగుతోందని పీజీఆర్‌ఎస్‌లో సంయుక్త కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.