హైదరాబాద్‌లో గణేష్ మండపాల ఏర్పాటుకు ఆన్‌లైన్ అనుమతులు తప్పనిసరి

రిపోర్టర్: రాము స్థలం: హైదరాబాద్

హైదరాబాద్‌లో వినాయక చవితి ఉత్సవాల నిర్వహణకు మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేసుకుని అనుమతులు తీసుకోవాలని సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు. చివరి నిమిషం వరకు వేచి చూడకుండా పోలీసు పోర్టల్ ద్వారా వివరాలు సమర్పించి భద్రతా ఏర్పాట్లకు సహకరించాలని కోరారు. ఉత్సవాలు మరియు నిమజ్జన వేడుకలను ప్రశాంతంగా, పకడ్బందీ బందోబస్తు మధ్య నిర్వహించేందుకు పోలీస్ శాఖ అన్ని ఏర్పాట్లు చేస్తోంది.