ఢిల్లీలో రాహుల్ గాంధీతో కలిసి సుప్రీంకోర్టుకు నిరసన మార్చ్: కోమటిరెడ్డి
రిపోర్టర్: రాము
స్థలం: నల్గొండ
శాంతియుత గొంతులను అణచివేయలేరని స్పష్టం చేస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు యువత, పౌర సమాజంతో కలిసి ఢిల్లీలో సుప్రీంకోర్టు వరకు నిర్వహించిన భారీ నిరసన మార్చ్‌లో పాల్గొన్నట్లు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి - మంత్రి, నల్గొండ ఎమ్మెల్యే వెల్లడించారు. ఎన్నికల ట్యాంపరింగ్‌కు వ్యతిరేకంగా ఐక్యంగా నిలబడ్డామని, ఎస్ఐఆర్ నిలిపివేతతో పాటు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.