ఏపీలో ఆర్టీఈ అమలుకు హైపవర్ కమిటీ ఏర్పాటు!

రిపోర్టర్: భాస్కర్ స్థలం: Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలల్లో విద్యా హక్కు చట్టం (ఆర్టీఈ) అమలుపై కీలక నిర్ణయం తీసుకుంది. నిరుపేద విద్యార్థులకు 25 శాతం సీట్ల రిజర్వేషన్‌ను పారదర్శకంగా అమలు చేసేందుకు పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ తమీమ్ అన్సారియా అధ్యక్షతన 16 మంది సభ్యులతో కూడిన హైపవర్ కమిటీని ఏర్పాటు చేస్తూ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జె. శ్యామలరావు ఉత్తర్వులు జారీ చేశారు.