అనంతపురం ఉన్మాది హేమంత్ పై కఠిన చట్టాల కింద కేసు నమోదు

రిపోర్టర్: రాజేష్ స్థలం: అనంతపురం

అనంతపురం జిల్లాలో సంచలనం సృష్టించిన రంపం దాడి ఘటనలో నిందితుడు హేమంత్ పై పోలీసులు అత్యంత కఠినమైన నాన్-బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. పాఠశాలలోకి చొరబడి బాలికలపై అరాచకానికి పాల్పడిన నిందితుడిపై హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ చట్టాలతో పాటు పలు సెక్షన్లు మోపినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోందని వారు స్పష్టం చేశారు.