ఆసియా గేమ్స్ టెక్నికల్ రేస్ అఫీషియల్ గా శ్రీకాంత్ ఎంపిక
రిపోర్టర్: మహేష్
స్థలం: విజయనగరం
గరుగుబిల్లి మండలం సంతోషపురానికి చెందిన తిమిటి శ్రీకాంత్ చతుర్వేది జపాన్ లో జరిగే 20వ ఆసియా గేమ్స్-2026 ఐచి-నగోయా పోటీలకు అంతర్జాతీయ టెక్నికల్ రేస్ అఫీషియల్ గా ఎంపికయ్యారు. ఈనెల 23 నుంచి ప్రారంభమయ్యే ఈ ఆసియా సెయిలింగు పోటీల కోసం ఆసియా సెయిలింగు ఫెడరేషన్ తరఫున ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా అధికారిక గుర్తింపు కార్డు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన ఆర్మీలో ఆర్టిలరీ విభాగంలో సుబేదార్ గా రాంచీలో విధులు నిర్వహిస్తున్నారు.