ఈ నెల 15న ఏపీపీఎస్సీ జాబ్ కలెండర్ ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల

రిపోర్టర్: మహేష్ స్థలం: Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఈ నెల 15న ఏపీపీఎస్సీ ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేయనుంది. అక్టోబర్ మొదటి వారంలో పూర్తి నోటిఫికేషన్ రానుంది. గ్రూప్-1, 2 పరీక్షలను ఆఫ్‌లైన్ విధానంలో నిర్వహించాలని నిర్ణయించారు. గ్రూప్-1 పోస్టుల సంఖ్యను 167కు పెంచుతూ ప్రభుత్వం సవరణ ఉత్తర్వులు జారీ చేసింది.