సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపిన ఏపీ ప్రభుత్వం
రిపోర్టర్: కిరణ్
స్థలం: అమరావతి
అమరావతిలోని స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయాల్లో ఆరేళ్ల సర్వీసును విజయవంతంగా పూర్తి చేసిన ఉద్యోగులకు ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్‌ను వర్తింపజేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 11వ వేతన సవరణ సంఘం మార్గదర్శకాల ప్రకారం ప్రత్యేక గ్రేడ్ పోస్ట్ స్కేల్‌ను మంజూరు చేస్తూ స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామ విభాగ కార్యదర్శి భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు.