టీనేజర్లు ఏఐ కోడింగ్ పై దృష్టి పెట్టాలని మెటా చీఫ్ సూచన

రిపోర్టర్: అశోక్ స్థలం: World

టీనేజర్లు అన్ని పక్కనపెట్టి ఏఐ టూల్స్ ద్వారా కోడింగ్ నేర్చుకోవడంపై పూర్తి సమయం కేటాయించాలని మెటా ఏఐ చీఫ్ అలెగ్జాండర్ వాంగ్ పిలుపునిచ్చారు. భవిష్యత్తులో ఇంజనీరింగ్ రంగం పూర్తిగా మారిపోతుందని, 13 ఏళ్ల వయసు నుంచే 'వైబ్ కోడింగ్' అభ్యసిస్తే భారీ ప్రయోజనం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఐదేళ్లలో ఏఐ టూల్స్ కోడింగ్ రంగంలో కీలక మార్పులు తెస్తాయని తెలిపారు.