నాపై వస్తున్న కులపరమైన తప్పుడు వార్తలను ఖండిస్తున్నా: ఐపీఎస్ మహేశ్ భగవత్
రిపోర్టర్: వెంకట్
స్థలం: హైదరాబాద్
సీఎం సమావేశంలో తనను వెనుక వరుసలో కూర్చోబెట్టడం వెనుక కులం ప్రస్తావన లేదని సీనియర్ ఐపీఎస్ మహేశ్ భగవత్ స్పష్టం చేశారు. తాను దళితుడిని కాదని, ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్లే వెనుక కూర్చున్నానని తెలిపారు. అధికారులను కులపరమైన వివాదాల్లోకి లాగడం సరికాదని, అనవసరమైన రూమర్లు నమ్మవద్దని ఆయన స్పష్టం చేశారు.