మైపాడు బీచ్‌లో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించిన కూటమి నాయకులు
రిపోర్టర్: కృష్ణ
స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆదేశాల మేరకు ఇందుకూరుపేట మండలం మైపాడు బీచ్ ప్రాంగణంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీచ్ పరిసరాలను శుభ్రం చేసి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు.