ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో హుకుంపేట వారపు సంత రద్దు
రిపోర్టర్: srinu boddeti
స్థలం: హుకుంపేట
స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపు ఏర్పాట్ల నేపథ్యంలో హుకుంపేట గ్రామంలో ఈనెల ఏడో తేదీన జరగాల్సిన వారపు సంతను పూర్తిగా రద్దు చేసినట్లు పంచాయతీ అభివృద్ధి అధికారి తెలిపారు. జూనియర్ కళాశాల వద్ద కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు చేయడంతో శాంతిభద్రతల పరిరక్షణ కొరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు, వ్యాపారులు ఈ విషయాన్ని గమనించి ఎన్నికల లెక్కింపు ప్రక్రియకు సహకరించాలని అధికారులు కోరారు.