అమెరికా, ఇజ్రాయెల్ కు ఇరాన్ గట్టి హెచ్చరిక: దాడులు చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని స్పష్టం

రిపోర్టర్: రాము స్థలం: టెహ్రాన్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహులకు ఇరాన్ పార్లమెంట్ సెక్యూరిటీ కమిషన్ చైర్మన్ ఇబ్రహీం అజిజీ ఘాటైన హెచ్చరికలు జారీ చేశారు. కొత్తగా ఎలాంటి సైనిక దాడులకు పాల్పడినా భౌగోళిక పరిమితులు లేకుండా తీవ్రంగా స్పందిస్తామని ఆయన స్పష్టం చేశారు. యుద్ధం ఎక్కడ ముగుస్తుందో వాషింగ్టన్ లేదా టెల్ అవీవ్ నిర్ణయించలేవని, టెహ్రాన్ మాత్రమే నిర్ణయిస్తుందని ఆయన తేల్చిచెప్పారు.