టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ పై శుభ్‌మన్ గిల్ క్లారిటీ: టాప్ 4 ఫిక్స్
రిపోర్టర్: రాము
స్థలం: ఆక్లాండ్
న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ లో భాగంగా టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ పై శుభ్‌మన్ గిల్ స్పష్టతనిచ్చారు. టాప్ ఆర్డర్ లో ఎలాంటి ప్రయోగాలు ఉండవని, రోహిత్, గిల్, కోహ్లీ, అయ్యర్ తొలి నాలుగు స్థానాల్ లో ఆడతారని ఆయన తేల్చిచెప్పారు. అయితే ఐదు, ఆరు స్థానాల్ లో మాత్రం మ్యాచ్ పరిస్థితిని బట్టి కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్‌లను మార్చే అవకాశం ఉంటుందని ప్రెస్ మీట్ లో శుభ్‌మన్ గిల్ వెల్లడించారు.