సోషల్ మీడియాకు దూరంగా ఉండటమే నా మనశాంతికి కారణం అంటున్న ఐశ్వర్యలక్ష్మి
రిపోర్టర్: కిరణ్
స్థలం: చెన్నై
కోలీవుడ్ నటి ఐశ్వర్యలక్ష్మి సోషల్ మీడియాకు పూర్తిగా దూరంగా ఉండాలని తీసుకున్న సంచలన నిర్ణయం వెనుక అసలు కారణాలను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఏఐ టెక్నాలజీ దుర్వినియోగం, సెలబ్రిటీలపై అసభ్యకర మార్ఫింగ్ ఫొటోలు, నెగెటివ్ కామెంట్లు, ట్రోల్స్ తనను తీవ్రమైన డిప్రెషన్‌కు గురిచేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. కోట్ల రూపాయల బ్రాండ్స్, ప్రమోషన్స్ నష్టపోయినా సరే తనకు దొరికిన ఈ మానసిక ప్రశాంతతే వేల కోట్ల విలువైనదని ఆమె స్పష్టం చేశారు.