నా సినిమాలను నజ్రియా మూడుసార్లు తిరస్కరించింది: ప్రీ రిలీజ్ వేదికపై హీరో సూర్య
రిపోర్టర్: కృష్ణ
స్థలం: చెన్నై
నటుడు సూర్య నటించిన తాజా చిత్రం ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో ఆయన మాట్లాడుతూ, గతంలో తన మూడు సినిమాల్ లో నటించాల్సిందిగా నజ్రియాను కోరితే ఆమె తిరస్కరించినట్లు తెలిపారు. ఇది తమ నాలుగో ప్రయత్నమని, ఎన్నో ఏళ్ల తర్వాత ఆమె తమ చిత్రానికి అంగీకరించిందని సూర్య వెల్లడించారు. దర్శకుడు జీతూ మాధవన్ తెరకెక్కించిన ఈ సినిమా నవంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.