అదిరిపోయే ఫీచర్లతో మార్కెట్లోకి ఐక్యూ 16 స్మార్ట్‌ఫోన్

రిపోర్టర్: సురేష్ స్థలం: World

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఐక్యూ త్వరలో సరికొత్త ఐక్యూ 16 హ్యాండ్‌సెట్‌ను లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ రోబోటిక్ ఆర్మ్ డిజైన్, ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్, 100x డిజిటల్ జూమ్ కెపాసిటీతో రానుంది. ఇందులో శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్, పెద్ద బ్యాటరీ ఉండే అవకాశం ఉంది. అయితే మెమరీ చిప్‌ల ధరల పెంపు కారణంగా ఇది భారత మార్కెట్లోకి రావడంపై సందిగ్ధత నెలకొంది.