యాదాద్రిలో నేత్రపర్వంగా సాగిన ఆంజనేయస్వామి ప్రత్యేక ఆకుపూజలు అభిషేకాలు
రిపోర్టర్: P.srinu
స్థలం: భువనగిరి
యాదాద్రీశుడి సన్నిధిలో క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామికి మంగళవారం ఉదయం నాగవల్లి దళార్చనలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కొండపైన విష్ణుపుష్కరిణి వద్ద ఉన్న ఆంజనేయస్వామి ఆలయంలో అర్చకులు పంచసూక్తాలు, మన్యు సూక్త పఠనాలతో అభిషేకం జరిపారు. సింధూరం మరియు వివిధ రకాల పూలతో స్వామివారిని సుందరంగా అలంకరించారు. పాతగుట్ట ఆలయంలో కూడా ఆంజనేయస్వామిని పంచామృతాలతో అభిషేకించి ప్రత్యేకంగా ఆకుపూజలు నిర్వహించగా భక్తులు భారీగా పాల్గొని తమ మొక్కులు చెల్లించుకున్నారు.