విజయనగరం: అమ్మవారి సిరిమాను వృక్షాల పూజా కార్యక్రమంలో పాల్గొన్న అదితి
రిపోర్టర్: కిరణ్
స్థలం: విజయనగరం
విజయనగరం మండలం జొన్నవలస గ్రామంలో సాక్షాత్కరించిన ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను మరియు ఇరుసుమాను వృక్షాలకు బొట్టు పెట్టు కార్యక్రమంలో పూసపాటి అదితి విజయనగరం పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా అమ్మవారి కరుణాకటాక్షాలు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని ప్రార్థించినట్లు ఆమె తెలిపారు. పవిత్రమైన ఈ పూజా కార్యక్రమంలో స్థానిక భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని విశేషంగా పూజలు నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు.