'కేసీఆర్‌తో డీల్ కుదరలేదా.. భూముల దర్యాప్తునకు 1000 రోజులా?': సీఎం రేవంత్‌పై బండి సంజయ్ ఫైర్

రిపోర్టర్: రాము స్థలం: కరీంనగర్

కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడిన కేంద్ర మంత్రి బండి సంజయ్ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో భూముల దర్యాప్తు జరిపించడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏకంగా 1000 రోజులు పట్టిందని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌తో సరైన డీల్ కుదరకనే ఇన్ని రోజులు ఆలస్యం చేశారా అని ప్రశ్నించారు. ఢిల్లీలోని ఏఐసీసీ పెద్దలకు ఈఎంఐ కట్టేందుకే రేవంత్ రెడ్డి కొత్త స్కెచ్‌లు వేస్తూ డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని బండి సంజయ్ సంచలన ఆరోపణలు గుప్పించారు.