ఏపీలో మేయర్లు, ఛైర్పర్సన్ల ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు చేసిన ఎస్ఈసీ

రిపోర్టర్: అశోక్ స్థలం: అమరావతి

ఆంధ్రప్రదేశ్ లోని వివిధ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు మరియు నగర పంచాయతీల ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో మేయర్లు, ఛైర్పర్సన్ల ప్రమాణ స్వీకార తేదీని రాష్ట్ర ఎన్నికల సంఘం ఖరారు చేసింది. ఈనెల ఇరవై మూడో తేదీన నూతనంగా ఎన్నికైన మేయర్లు, ఛైర్పర్సన్లు ప్రమాణ స్వీకారం చేస్తారని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు స్పష్టం చేశారు. అయితే డిప్యూటీ మేయర్లు, వైస్ ఛైర్పర్సన్ల ఎన్నికపై త్వరలోనే స్పష్టత వస్తుందని అధికార వర్గాలు వెల్లడించాయి.