దివంగత నేత కాకా జయంతి వేడుకలు: బెల్లంపల్లి ఎమ్మెల్యే నివాళి
రిపోర్టర్: PRASAD
స్థలం: బెల్లంపల్లి
దివంగత మాజీ కేంద్ర మంత్రి గడ్డం వెంకటస్వామి 97వ జయంతి వేడుకలను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కాలేజీ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్‌తో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు.