రాజాం మున్సిపాల్టీకి మార్గం సుగమం: హైకోర్టు తీర్పుతో ఎన్నికల ప్రక్రియ షురూ

రిపోర్టర్: సునీల్ స్థలం: రాజాం

రాజాం పురపాలిక ఎన్నికల నిర్వహణకు ఎదురైన న్యాయపరమైన అవాంతరాలు పూర్తిగా తొలగిపోయినట్లు ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ తెలిపారు. హైకోర్టు వ్యాజ్యాలను కొట్టివేయడంతో దశాబ్దాల తర్వాత పట్టణంలో ఎన్నికలకు మార్గం సుగమమైందని ఆయన వెల్లడించారు. ఈ తీర్పుతో రాజకీయ వర్గాల్లో వేడి పుట్టుకొచ్చిందని, పట్టణవాసులు హర్షాతిరేకాలు వ్యక్తపరుస్తున్నారని పేర్కొన్నారు. త్వరితగతిన ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేస్తూ తెదేపా శ్రేణులు ఘనంగా సంబరాలు జరుపుకున్నాయి.