వైద్యరంగంలో కలకలం: దేశంలో యువతను కంటిమీద కునుకులేకుండా చేస్తున్న క్యాన్సర్ ముప్పు

రిపోర్టర్: శివ స్థలం: ఢిల్లీ

దేశ రాజధాని ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆసుపత్రిలో పదిహేనేళ్ల వయసున్న కౌమార దశ యువతలో గ్యాస్ట్రోఇంటెస్టినల్ క్యాన్సర్ కేసులు వెలుగు చూస్తున్నట్లు ఆంకాలజిస్టులు తెలిపారు. ఈ నేపథ్యంలో పెరుగుతున్న వాయు కాలుష్యం, పీఎం 2.5 వంటి ప్రమాదకర కాలుష్య కారకాలు యువతలో క్యాన్సర్ ముప్పునకు కారణమవుతున్నాయా అనే కోణంలో వైద్య నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ లోతైన పరిశోధనలు జరుపుతున్నట్లు స్పష్టం చేశారు.