ఐఐటీ బొంబాయి ఆత్మహత్య కేసులో నిందితుల అరెస్ట్ ముఖ్యం
రిపోర్టర్: కృష్ణ
స్థలం: ముంబై
ఐఐటీ బొంబాయి విద్యార్థి ఆత్మహత్య కేసుకు సంబంధించి నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని బాధితుడి తరఫు న్యాయవాది నిఖిల్ కాంబ్లే డిమాండ్ చేశారు. ముంబైలో మీడియాతో మాట్లాడుతూ దర్యాప్తు సజావుగా సాగాలంటే కేసులో పేరున్న నిందితుల అరెస్ట్ అత్యంత కీలకమని స్పష్టం చేశారు. బాధితుడి కుటుంబానికి న్యాయం జరగాలని, చట్టపరమైన పోరాటాన్ని కొనసాగిస్తామని ఆయన వెల్లడించారు.