ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటపై బంధువుల దాడి యువతి కిడ్నాప్

రిపోర్టర్: Gangadhar Reporter స్థలం: జన్నారం

మంచిర్యాల జిల్లా జన్నారం మండలం పొనకల్ మేజర్ గ్రామపంచాయతీ వినాయకనగర్ లో ప్రేమ వివాహం చేసుకున్న జంటపై యువతి తల్లిదండ్రులు, బంధువులు దాడికి పాల్పడ్డారు. నాగరాజు, శృతి దంపతులు అద్దె ఇంట్లో ఉంటుండగా.. మంగళవారం రాత్రి రెండు కార్లలో వచ్చిన బంధువులు యువకునిపై, అతని తల్లిపై దాడి చేసి యువతిని బలవంతంగా కారులో ఎక్కించుకుని కిడ్నాప్ చేశారు. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.