ఇళ్ల పట్టాల పంపిణీతోనే బెల్లంపల్లి పట్టణ భవితవ్యం
రిపోర్టర్: ramesh chitty
స్థలం: బెల్లంపల్లి
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో జీవో 76 ను పునరుద్ధరించి పేద ప్రజలకు వెంటనే ఇళ్ల పట్టాలు ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు తాసిల్దార్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టి వినతిపత్రం అందజేశారు. గత ప్రభుత్వ హయాంలో వేలాది మందికి ఇళ్ల పట్టాలు అందించామని, కాంగ్రెస్ ప్రభుత్వం మిగతా దరఖాస్తులను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు.