భారత వాయుసేన కొత్త చీఫ్గా ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ నియామకం

రిపోర్టర్: నరేష్ స్థలం: న్యూఢిల్లీ

భారత వాయుసేన నూతన అధిపతిగా ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ నియమితులయ్యారని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుత వాయుసేన చీఫ్ అమర్ ప్రీత్ సింగ్ పదవీకాలం అక్టోబర్ 31తో ముగియనుండటంతో, ఆయన స్థానంలో 29వ వాయుసేన చీఫ్గా అశుతోష్ దీక్షిత్ బాధ్యతలు చేపట్టనున్నారు. సుదీర్ఘ సేవా కాలంలో అనేక కీలక బాధ్యతలు నిర్వర్తించిన ఆయన నియామకం రక్షణ రంగంలో ప్రాధాన్యత సంతరించుకుంది.